ఇంటర్ అడ్మిషన్లకు నేడు, రేపు (సెప్టెంబర్ 11, 12న) చాన్స్

ఇంటర్ అడ్మిషన్లకు నేడు, రేపు (సెప్టెంబర్ 11, 12న) చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ ఫస్టియర్ లో చేరే విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 11,12వ తేదీల్లో ప్రవేశాలు చేసుకోవచ్చని, దీనికి అనుగుణంగా ఆన్​లైన్​ పోర్టల్ ఓపెన్ చేస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రైవేటు, గవర్నమెంట్ కాలేజీల్లోనూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

అయితే, ప్రైవేటు కాలేజీల్లో ఒక్కో అడ్మిషన్​కు రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని, సర్కారులో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇప్పటికే ఇచ్చిన వివరాల్లో తప్పుల సవరణకూ చాన్స్ ఉందని చెప్పారు. గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే పేరెంట్స్ అడ్మిషన్లు తీసుకోవాలని, వివరాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్​లో పెట్టామని పేర్కొన్నారు.